Rakesh Agarwal: ఎన్ఐఏ కొత్త బాస్‌గా రాకేశ్ అగర్వాల్: కేంద్రం కీలక ఉత్తర్వులు
దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (NIA)కు నూతన కొత్త డైరెక్టర్ జనరల్‌గా (DG) సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ అగర్వాల్‌ను (Rakesh Agarwal) నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ (ACC) ఈ నియామకానికి ఆమోదముద్ర వేసింది. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రాకేశ్ అగర్వాల్‌కు (Rakesh Agarwal) ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు, క్లిష్టమైన కేసుల దర్యాప్తులో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయనకు ఎన్ఐఏలో స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉండటం, సంస్థ పనితీరుపై పూర్తి అవగాహన ఉండటంతో కేంద్రం ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మెకానికల్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్లో డిగ్రీలు పూర్తి చేసిన రాకేశ్ అగర్వాల్ (Rakesh Agarwal).. 2028 ఆగస్టు 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
డిసెంబర్ 31న అప్పటి డీజీ సదానంద వసంత్ దాతే పదవీ విరమణ చేయడంతో ఈ కీలక పదవి ఖాళీ అయింది. ఇన్నాళ్లు ఎన్ఎస్జీ డీజీ బి.శ్రీనివాస్ ఈ సంస్థ డీజీగా అదనపు బాధ్యతలు చూస్తుండగా, ఇప్పుడు రాకేశ్ అగర్వాల్ (Rakesh Agarwal) పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించనున్నారు.






