Ramon Magsaysay Award : భారతీయ ఎన్జీవోకు ప్రతిష్టాత్మక పురస్కారం

ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు (Ramon Magsaysay Award) 2025ను భారత్‌కు చెందిన ఎన్‌జీఓ ఎడ్యుకేట్ గర్ల్స్ (NGO Educate Girls) గెలుచుకుంది. దీంతో ఈ అవార్డు సాధించిన తొలి భారత ఎన్‌జీఓగా నిలిచింది. ఈ విషయాన్ని రామన్ మెగసెసే అవార్డు ఫౌండేషన్ (ఆర్‌ఎంఎఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. బాలికలు, యువతులు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు పరిష్కరించడం, నిరక్షరాసత్య బానిసత్వం నుంచి వారి విముక్తి చేయడం, వారు తమ పూర్తి సామర్థ్యాన్ని అందుకోవడానికి వారిలో నైపుణ్యాలు, ధైర్యం, స్వచ్ఛందతను నింపడం వంటి వాటిలో నిబద్ధతకు గా గుర్తింపుగా అవార్డు (Award) కు ఎంపిక చేసినట్టు ప్రకటనలో వెల్లడించింది. భారత్ నుంచి ఇప్పటి వరకూ వ్యక్తిగతంగానే అవార్డును అందుకున్నారు. తొలిసారిగా ఈ ఏడాది ఒక ఎన్‌జీఓకు లభించింది.
అలాగే, ఈ ఏడాది అవార్డు ఎడ్యుకేట్ గర్ల్స్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు కూడా ప్రకటించారు. పర్యావరణకు కృషి చేస్తున్న మాల్దీవులకు చెందిన షాహినా అలీ (Shahina Ali) , పేదలు-అణగారిన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న ఫిలిఫ్పీన్స్‌కు చెందిన ప్లావియానో ఆంటోనియో (Flaviano Antonio) ఎల్ విల్లానుయేవాలకు ఈ ఏడాది అవార్డు లభించింది. ఈ 67వ రామన్ మెగసెసే అవార్డు ప్రదానోత్సవం నవంబర్ 7న మనీలాలోని మెట్రోపాలిటిన్ థియేటర్‌లో జరగనుంది. ఈ అవార్డు కింద ఒక పతకం, ప్రశంసా పత్రం, నగదు బహుమతిని అందుకుంటారు. ఈ అవార్డును అసాధారణమైన ధైర్యం, న్విస్వార్థ సేవను ప్రదర్శించ ఆసియాకు చెందిన వ్యక్తులకు, సంస్థలకు ఇస్తారు. ఈ అవార్డును అసియా నోబెల్ బహుమతిగా భావిస్తుంటారు.