India: పాకిస్థాన్‌కు భారత్ షాక్ .. అప్పటివరకు నిలిపివేత
పహల్గాం ఉగ్ర దాడికి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor ) తో గట్టి బదులిచ్చిన భారత్ (India) , సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేసి పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చింది. దాయాది దేశం ఉగ్రవాదాన్ని వదిలి పెట్టేవరకు ఆ నిలిపివేత కొనసాగుదుందని రాజ్యసభలో విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. నీరు, రక్తం, కలిసి ప్రవహించవని మరోసారి తేల్చిచెప్పారు. ఈ ఒప్పందం కుదుర్చుకొన్న సమయంలో అధికారంలో ఉన్నవారు భారత రైతుల కంటే పాకిస్థాన్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని దుయ్యబట్టారు. గత కాంగ్రెస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టారు. 60 ఏళ్ల పాటు మాజీ ప్రధాని నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దలేమని చెప్తూ వచ్చారు. కానీ వాటిని మార్చవచ్చని మోదీ ప్రభుత్వం చూపించింది. అందుకు ఉదాహరణలే ఆర్టికల్ 370 రద్దు. ఇప్పుడు సింధూ జలాల ఒప్పందాన్ని సరిదిద్దుతున్నాం అని వెల్లడిరచారు.






