Pakistan: పాకిస్థాన్‌కు ఒక్క చుక్క నీరు కూడా వెళ్లనీయం: కేంద్ర జలమంత్రి

పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగుదేశానికి (Pakistan) గట్టిగా బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. భారత్ నుంచి పాకిస్థాన్‌కు (Pakistan) ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చేస్తామని ఆయన స్పష్టంచేశారు. ఉగ్రదాడి పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. సీఆర్ పాటిల్ మాట్లాడుతూ.. “ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ అనేక ఆదేశాలు జారీ చేశారు. వాటిని పక్కాగా అమలు చేస్తాం. ఇందులో భాగంగానే అమిత్ షాతో సమావేశమయ్యాం. సింధూ నదీ జలాల ఒప్పందంపై భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించాం. ఉగ్రదాడులను ఏ మాత్రం సహించబోమని పాకిస్థాన్‌కు (Pakistan) స్పష్టమైన సంకేతాలు పంపాం. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం పూర్తిగా సమర్థనీయమైనది” అని అన్నారు. భారత్ ఇప్పటికే పాకిస్థాన్‌తో (Pakistan) సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే.