Jaishankar : విభేదాలు వివాదాలుగా మారొద్దు : జైశంకర్

విభేదాలు వివాదాలుగా మారొద్దని చైనా (China)కు భారత్ (India) సూచించింది. భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi)తో సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar) ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా సాగాలన్నారు. దీనికి రెండు వైపుల నుంచి నిజాయితీతో పాటు నిర్మాణాత్మక సహకారం అవసరమని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని సంయుక్తంగా నెలకొల్పడం అవసరమన్నారు. అదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పీచమణచాల్సిందేనని జై శంకర్ స్పష్టం చేశారు.