America : అమెరికా సుంకాలపై … స్పందించిన భారత్
అమెరికా సుంకాలపై భారత్ (India) స్పందించింది. అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేదానిపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతులు (Farmers), వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది.
భారత్‌పై సుంకాలు విధించిన కాసేపటికే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు శత్రుదేశామైన పాకిస్థాన్ (Pakistan) తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాక్‌లో భారీ చమురు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదిరినట్టు ప్రకటనలో చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో పాకిస్థాన్ నుంచి కూడా భారత దేశం చమురును కొనుకునే అవకాశం ఉంటుందని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు.






