India-Canada: భారత్-కెనడా మధ్య $2.6 బిలియన్ల యురేనియం డీల్!
భారత్, కెనడా (India-Canada) దేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాల్లో కీలక ముందడుగు పడింది. భారత పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 2.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 21 వేల కోట్లు) విలువైన భారీ యురేనియం సరఫరా ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
నిరంతరాయంగా అణు ఇంధన సరఫరా..
భారతదేశ పౌర అణు ఇంధన (Civil Nuclear) అవసరాలకు నిరంతరాయంగా యురేనియం సరఫరాను నిర్ధారించడమే ఈ డీల్ ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తు ఇంధన అవసరాల కోసం చిన్న తరహా అణు రియాక్టర్లు (Small Modular Reactors), అత్యాధునిక రియాక్టర్ల నిర్మాణంలో ఇరు దేశాలు సాంకేతికంగా కలిసి పనిచేయనున్నట్లు ప్రధాని మోదీ (India-Canada) అధికారికంగా ప్రకటించారు.
2026 నాటికి వాణిజ్య ఒప్పందం..
యురేనియం డీల్‌తో పాటే, రెండు దేశాల (India-Canada) మధ్య వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’ (CEPA)పై లాంఛనంగా చర్చలు జరిపేందుకు ఇరువురు నేతలు అంగీకారం తెలిపారు. 2026 సంవత్సరాంతానికి ఈ కీలక వాణిజ్య ఒప్పందాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని రెండు దేశాలు దృఢ నిశ్చయంతో ఉన్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
వివేకానందుడిని స్మరించిన కెనడా ప్రధాని..
ప్రధాని మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత్‌కు (India-Canada) వచ్చిన మార్క్ కార్నీ.. ఈ సమావేశంలో భారతీయ ఆధ్యాత్మికతను ప్రస్తావించి అందరినీ ఆకట్టుకున్నారు. 1893లో స్వామి వివేకానంద కెనడాలో పర్యటించిన చారిత్రక ఘట్టాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. స్వామి వివేకానంద చెప్పిన ప్రసిద్ధ సూక్తి.. “లేవండి.. మేల్కొనండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి” అని ప్రస్తావించి సభలో స్ఫూర్తి నింపారు. ఈ ఒప్పందాలతో ఇరు దేశాల (India-Canada) మధ్య మైత్రి కొత్త పుంతలు తొక్కుతుందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి

















