IIT Madras: ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025
IIT Madras: ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025 భారతదేశ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తల ప్రతిభకు భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాలైన రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025 విజేతల జాబితాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras)కు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లకు స్థానం దక్కింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డులను విజ్ఞాన్ రత్న (VR), విజ్ఞాన్ శ్రీ (VS), విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ (VY-ASB), విజ్ఞాన్ టీమ్ (VT) అనే నాలుగు కేటగిరీలలో అందజేస్తారు.
ఈ సంవత్సరం ఐఐటీ మద్రాస్‌కు (IIT Madras) చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు ఈ గౌరవం అందుకున్నారు. ప్రొఫెసర్ తలప్పిల్ ప్రదీప్‌కు విజ్ఞాన్ శ్రీ (VS) పురస్కారం దక్కగా.. ప్రొఫెసర్ మహాశంకర్ శివప్రకాశం, ప్రొఫెసర్ శ్వేతా ప్రేమ్ అగర్వాల్ ఇద్దరూ విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ (VY-ASB) అవార్డులను అందుకున్నారు. ఈ అద్భుతమైన ఘనతపై ఐఐటీ మద్రాస్ (IIT Madras) డైరెక్టర్ హర్షం వ్యక్తం చేశారు, ఇది తమ సంస్థ ప్రతిష్టను మరింత పెంచింది.







