Jaishankar: మా ఉత్పత్తులు కొనకండి ..అమెరికా కు జైశంకర్ కౌంటర్

రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ (S. Jaishankar) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. భారత్‌తో ఏదైనా సమస్య ఉంటే, ఇక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఢల్లీిలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సు (World Leaders Forum Conference) లో జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ (India) , అమెరికా వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మాకంటూ కొన్ని ప్రయోజన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. మా రైతులు, చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాలను రక్షించడమే మాకు ప్రధానం. దీనిపై మేం రాజీపడే ప్రసక్తే లేదు. వ్యాపార అజెండాతో సాగుతున్న అమెరికా (America) యంత్రాంగానికి మద్దతిస్తున్న కొన్ని దేశాలు ఇతరులపై నిందలు వేసే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం. నిజంగా మీకు భారత్‌తో సమ్యస ఉంటే, మా చమురును, శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయకండి. వాటిని కొనాలని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయట్లేదు. మీకు నచ్చకపోతో కొనకండి అని జైశంకర్ అన్నారు.