Roshni Nadar: రికార్డు సృష్టించిన హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్ .. దేశంలోనే

హెచ్‌సీఎల్ (HCL) టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar Malhotra) దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. 2.84 లక్షల కోట్ల సంపదతో దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో రోష్ని, ఆమె కుటుంబం మూడో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఓ మహిళ మూడో స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. అంతేగాక తొలి పది మందిలో నిలిచిన పిన్న వయస్కురాలి(44)గానూ ఆమె
ఈ జాబితాలో 100 మంది మహిళలు ఉండడం విశేషం. నైకా సంస్థకు చెందిన ఫల్గుణి నాయర్ (Falguni Nair) , బయోకాన్ కిరణ్ మజుందార్ షా (Kiran Mazumdar Shah) కూడా ఇందులో నిలిచారు. భారత్‌లో సంపదను సృష్టించడంలో మహిళలది కూడా కీలక పాత్రేనని చాటారు. కాగా తన సంపద విలువ 6 శాతం తగ్గినా రూ.9.55 లక్షల కోట్లతో ముకేశ్ అంబానీ భారత సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. రూ.8.15 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం రెండో స్థానంలో ఉంది. సీరం ఇన్‌స్టిట్యూట్ సైరస్ పూనావాలా, ఆదిత్య బిర్లా గ్రూప్ అధిపతి కుమార మంగళం బిర్లా, నీరజ్ బజాజ్ ఆయన కుటుంబం, దిలీప్ సంఘ్వీ, అజీం ప్రేమ్‌జీ ఆయన కుటుంబం, గోపీచంద్ హిందూజా, రాధాకిషన్ దమానీ కుటుంబం హురున్ తొలి పదిమంది భారత సంపన్నుల జాబితాలో ఉన్నారు.\