Oil Imports: రష్యా చమురు దిగుమతులపై యూఎస్ ఆంక్షలు.. హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు

రష్యా నుంచి చమురు దిగుమతులు (Oil Imports) చేసుకుంటున్న దేశాలపై భారీగా సుంకాలు వేస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Puri) స్పందించారు. ఒకవేళ రష్యా నుంచి చేసుకునే దిగుమతలుపై (Oil Imports) సెకండరీ ఆంక్షలు విధించినా, భారత్ తన అవసరాలను ప్రత్యామ్నాయ వనరుల నుంచి తీర్చుకోగలదని ఆయన (Hardeep Puri) స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పూరి అన్నారు. భారత్ తన చమురు వనరులను గణనీయంగా విస్తరించిందని, గతంలో 27 దేశాల నుంచి చమురు కొనుగోలు చేసేదని, ప్రస్తుతం దాన్ని 40 దేశాలకు పెంచామని మంత్రి (Hardeep Puri) తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు అందుబాటులో ఉండటం వల్ల.. వచ్చే త్రైమాసికంలో చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రెజిల్, గయానా, కెనడా వంటి దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లోకి చమురు వస్తోందని పేర్కొన్నారు.