Draupadi Murmu : రాష్ట్రపతితో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు భేటీ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi ) ని గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు (Ashoka Gajapati Raju) మర్యాదపూర్వకంగా కలిశారు. గోవా గర్నర్‌గా నియమితులైన తర్వాత ఢల్లీిలో పర్యటించిన ఆయన తొలుత రాష్ట్రపతి భవన్‌కు చేరుకొని ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు. అనంతరం పార్లమెంట్‌కు వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా (Amit Shah) , జేపీ నడ్డా, రామ్మోహన్ నాయుడుతో వేర్వేరుగా భేటీ అయ్యారు. పార్లమెంట్ వద్ద అశోక్ గజపతిరాజుకు టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, కలిశెట్టి అప్పలనాయుడు స్వాగతం పలికారు.