Rahul Gandhi: ఎన్నికల అధికారులే దొంగలకు సహకరిస్తున్నారు: రాహుల్ గాంధీ
బిహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ‘ఓటు చోరీ’ జరిగిందని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన ఆరోపణలు చేశారు. హర్యానాలో అధికారాన్ని బీజేపీ ఎలా దొంగిలించిందో తాను సాక్ష్యాలతో నిరూపించానని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. బిహార్లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ద్వారా ఓటర్ల జాబితాలో మార్పులు చేశారని, లక్షలాది మంది ఓటర్లను తొలగించారని ఆయన (Rahul Gandhi) విమర్శించారు. బిహార్లో మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్న వీడియోలు ‘ఓటు చోరీ’ జరుగుతోందనే వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని రాహుల్ అన్నారు.







