Vice President : ఉప రాష్ట్రపతి ఎన్నిక షురూ

ఉపరాష్ట్రపతి (Vice President) పదవికి ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) అధికారిక నోటిఫికేషన్ (Notification) ను విడుదల చేసింది. ఎన్నికలు సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. అదే రోజు ఓట్ల లెక్కింపు (Counting of votes ) ను కూడా చేపడతారని వెల్లడించారు.
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఆగస్టు 21
నామినేషన్ల పరిశీలన: ఆగస్టు 22
నామినేషన్ల ఉపసంహరణకు గడువు: ఆగస్టు 25
పోలింగ్, ఓట్ల లెక్కింపు: సెప్టెంబర్ 9
ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా సాగనుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.