Vice President: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అబ్జర్వర్లను నియమించిన ఈసీ
ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ బుధవారం నాడు నామినేషన్ వేయగా, గురువారం ఇండియా కూటమి తరఫున జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (Election Commission) పరిశీలకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సుశీల్ కుమార్ లోహాని, ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డి.ఆనందన్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ నితిన్ కుమార్ శివదాస్లను అబ్జర్వర్లుగా ఈసీ (Election Commission) నియమించింది.శుక్రవారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 9న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. లోక్సభ, రాజ్యసభ కలిపి మొత్తం 786 మంది ఎంపీలు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఉపరాష్ట్రపతిగా (Vice President) గెలవాలంటే 394 ఓట్లు సాధించాలి.






