Divya Deshmukh: ఫిడే ప్రపంచ చెస్ రాారాణి దివ్య దేశ్ ముఖ్..

ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ గా దివ్య దేశ్ ముఖ్ (Divya Deshmukh) విజయం సాధించారు. టైబ్రేక్ కు దారి తీసిన ఫైనల్లో దివ్య .. కోనేరు హంపీని ఓడించారు. దివ్య దేశ్ ముఖ్ వయసు 19 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులోనే ప్రపంచ కప్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించారు. ఫైనల్ లో హంపి తీవ్రంగా పోరాడింది, కానీ దివ్య దేశ్‌ముఖ్ తన కొత్త తరహా ఆటతో హంపీని ఓడించింది. ఫైనల్‌లో గెలవడం ద్వారా దివ్య గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను డైరెక్ట్ గా సాధించేసినట్లయింది.
గ్రాండ్‌మాస్టర్ (GM) టైటిల్‌ను సాధించడానికి, ఒక ఆటగాడు మూడు GM నార్మ్‌లను, 2500 రేటింగ్‌ను సాధించాలి. దివ్య ఫిడే మహిళల వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా డైరక్ట్ టైటిల్ సాధించారు.ఇది ఆమెను కొనేరు హంపీ, హరిక ద్రోణవల్లి, ఆర్. వైశాలి తర్వాత భారతదేశం నాల్గవ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచేలా చేస్తుంది. ఫిడే నిబంధనల ప్రకారం మూడు నార్మ్‌లు , 2500 రేటింగ్ అవసరాన్ని దాటవేస్తుంది. దివ్య ఆక్రమణాత్మక , టాక్టికల్ చెస్ ఆడటంలో మంచి నైపుణ్యం సాధించారు. 19 సంవత్సరాల వయస్సులో, దివ్య తన ఆటలో అసాధారణమైన పరిపక్వతను ప్రదర్శిస్తున్నారని చెస్ ప్లేయర్లు ప్రశంసిస్తున్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కు చెందిన దివ్యా దేశ్ ముఖ్ 2021లో భారతదేశం 21వ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచారు. ఇంటర్నేషనల్ మాస్టర్ (IM) టైటిల్‌ను గతంలోనే పొందారు. 2025 ఫిడే మహిళల వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా ఆమె మొదటి గ్రాండ్‌మాస్టర్ నార్మ్‌ను సాధించింది. ఇప్పుడు టైటిల్ కూడా సాధించి తిరుగులేని భవిష్యత్ ఉందని నిరూపించింది.
దివ్య దేశ్‌ముఖ్ అనేక అంతర్జాతీయ జాతీయ టోర్నమెంట్లలో అద్భుతమైన ప్రతిభ చూపింది. జూన్ 2024లో, దివ్య 18 సంవత్సరాల వయస్సులో వరల్డ్ జూనియర్ గర్ల్స్ టైటిల్‌ను గెలుచుకుంది, కొనేరు హంపీ (2001), హరిక ద్రోణవల్లి (2008), సౌమ్య స్వామినాథన్ (2009) తర్వాత ఈ టైటిల్ గెలిచిన నాల్గవ భారతీయ చెస్ ప్లేయర్ గా నిలిచారు.