Dharmendra Pradhan: దేశ భాషలన్నీ జాతీయ భాషలే: కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్

కశ్మీర్‌లోని చీనార్ బుక్ ఫెస్టివల్‌లో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan).. దేశంలోని అన్ని భాషలూ జాతీయ భాషలే అని స్పష్టం చేశారు. భారతదేశ భాషా వైవిధ్యాన్ని గుర్తుచేస్తూ, కశ్మీరి, తమిళం, మలయాళం, అస్సామీస్ వంటి అన్ని భాషలూ జాతీయ భాషలేనని అన్నారు. దేశంలో ఐకమత్యం పెంపొందించడానికి, కశ్మీర్ పిల్లలు తమిళ సాహిత్యాన్ని, తమిళనాడు పిల్లలు కశ్మీరి రచనలను చదవాలని ఆయన (Dharmendra Pradhan) సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రచించిన ‘జమ్మూకశ్మీర్ అండ్ లడఖ్: త్రూ ది ఏజెస్’ అనే పుస్తకం కశ్మీరి అనువాదాన్ని ఆయన ఆవిష్కరించారు. అనువాదం అనేది కేవలం భాషా ప్రక్రియ కాదని, అది ఒక జాతీయ బాధ్యతని ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) అభివర్ణించారు.