Rajnath Singh: ఆపరేషన్ సిందూర్‌తో దేశ ఖ్యాతి పెరిగింది: రక్షణ మంత్రి
‘ఆపరేషన్ సిందూర్’ సాధించిన విజయం దేశం గర్వించదగ్గ మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కొనియాడారు. ఈ మిషన్‌లో మేడ్-ఇన్-ఇండియా ఆయుధాలు అద్భుతమైన సత్తా చూపించాయని, తద్వారా అంతర్జాతీయంగా వీటిపై ఫోకస్ పెరిగిందని చెప్పారు. అన్నారు. ఢిల్లీలో సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫాక్చరర్స్ (SIDM) సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో రక్షణ రంగ సామర్థ్యం వేగంగా పెరుగుతోందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఆకాష్ మిసైల్, బ్రహ్మోస్, ఆకాష్‌తీర్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టం పనితీరుతో దేశ రక్షణ రంగ ఉత్పత్తుల ఖ్యాతి పెరిగిందని రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. భద్రతా దళాలతో భారత రక్షణ పరిశ్రమ సమన్వయాన్ని మెచ్చుకున్న ఆయన.. ఈ విజయానికి కృషి చేసిన ‘ఇండస్ట్రీ వారియర్స్’ ను అభినందించారు. సైన్యం, నౌకాదళం, వాయుసేన తర్వాత రక్షణ పరిశ్రమ కూడా ‘నాల్గవ దళం’ లాంటిదని కితాబిచ్చారు.
భవిష్యత్తుకు ‘ఆపరేషన్ సిందూర్’ ఒక కేస్ స్టడీ వంటిదని ఆయన (Rajnath Singh) అన్నారు. సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, కాబట్టి యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండటమే మన పునాది కావాలని సూచించారు. అంతర్జాతీయ అనిశ్చితి, మారుతున్న యుద్ధ తంత్రాల నేపథ్యంలో ఆయుధాల ఉత్పత్తిలో స్వదేశీ మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమమని చెప్పారు.







