Narendra Modi : కూలిన మోదీ, ట్రంప్ బంధం : కాంగ్రెస్

భారత్ పై మరిన్ని సుంకాలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వాణిజ్య బెదిరింపులపై కాంగ్రెస్ (Congress) విరుచుకుపడిరది. ఐకానిక్ సాంగ్ దోస్త్ దోస్త్ నరహా తో కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ట్రంప్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బందం పూర్తిగా కూలిపోయిందని పేర్కొంది. రష్యా (Russia) ముడి చమురు సేకరణ లక్ష్యంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనను సాధువైనదంటూ విమర్శించింది. ఈ విషయంపై ప్రధాన మంరతి ఎందుకు మాట్లాడటం లేదని కూడా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జ్ కమ్యూనికేషన్స్ జైరాం రమేష్ (Jairam Ramesh) ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం ముఖ్యాంశ వేటగా ఉందని ఎద్దేవా చేశారు.