Mallikarjun Kharge: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థత

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హుటాహుటిన బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు . శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి సమస్యలు తలెత్తడంతో ఆయన జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన (Mallikarjun Kharge) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితి కుదుటపడేవరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్యులు ఆయనకు పేస్ మేకర్ అమర్చాలని సూచించినట్లు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ఖర్గే (Mallikarjun Kharge) ఆసుపత్రి పాలయ్యారనే వార్త తెలియగానే కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 2022 అక్టోబర్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.