Revanth Reddy: ఏం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సాబ్..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి.. బిజెపి(BJP) పెద్దలతో అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో స్నేహం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు.. రేవంత్ రెడ్డి విషయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నా పరోక్షంగా బిజెపికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు రేవంత్ రెడ్డి. ఇక మోడీ కూడా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం సంచలనమైంది. సాధారణంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా కష్టం. గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు ప్రయత్నాలు చేసి కూడా సైలెంట్ అయ్యారు. ఎన్ డి ఏ ముఖ్యమంత్రి కూడా ప్రధానిని కలవడం సాధ్యమయ్యేది కాదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే తాను ఎవరిని కలవాలనుకున్నా కలుస్తున్నారు.
కేంద్ర మంత్రులు కూడా రేవంత్ రెడ్డి వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఇక తాజాగా ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చాలా సన్నిహితంగా కనిపించారు. దీనితో కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్ అవుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గానే ఉంది. ఇటీవల రాహుల్ గాంధీ.. రేవంత్ కు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. దీనితో రేవంత్ కూడా కాస్త అసహనానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఏమైనా తలనొప్పులు తెస్తారో… అసలు ఆయన.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా అనేది అర్థం కాని పరిస్థితి. ఇక రాష్ట్రంలో ఉన్న బిజెపి నేతలపై రేవంత్ రెడ్డి ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. కానీ కేంద్రంలోని కీలక నేతలతో మాత్రం ఆయన స్నేహం చేయడం గమనార్హం.