కమల్ హాసన్ కు మరో షాక్…

తమిళనాడులోని నటుడు కమల్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ నుండి నేతలు ఒక్కొక్కరిగా వీడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కమల్ హాసన్ కు మరో షాక్ ఎదురైంది. ఎంఎన్‍ఎం కీలక నేత సీకే కుమారవేల్ పార్టీని వీడారు. హీరో ఆరాధన, వ్యక్తి పూజను వ్యతిరేకిస్తూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఓటమికి నైతికంగా బాధ్యత వహిస్తూ వీడుతున్నానని అన్నారు. ఈయనతో కలిసి పార్టీని వీడిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్‍ఎం ఒక్క సీటు కూడా గెలుపొందలేదు. కోయంబత్తూర్ (సౌత్) నుంచి ఎంఎన్‍ఎం అధినేత కమల్ హాసన్ సైతం ఓటమి పాలైన సంగతి తెలిసింది.ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు నేతలు కమల్ పార్టీని వీడారు.