Vote Chori: సాఫ్ట్‌వేర్‌తో ఓట్లు తొలగించడం అసాధ్యం: ఈసీ

ఓట్ చోరీపై (Vote Chori) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తుంచారని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవాలని ఈసీ పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా ఓట్లను తొలగించడం సాంకేతికంగా సాధ్యం కాదని స్పష్టంచేసింది. ఓటరుకు తెలియకుండా వారి ఓటును కూడా తొలగించడం అసాధ్యమని ఈసీ (EC) వివరించింది. 2023లో కర్ణాటకలోని అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుకు విఫల ప్రయత్నాలు జరిగాయని అంగీకరించిన ఈసీ (EC).. దీనిపై తామే ఫిర్యాదు చేశామని, అప్పట్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని తెలిపింది. ఆ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని, అయితే 2023లో కాంగ్రెస్ నాయకుడు బీఆర్ పాటిల్ విజయం సాధించారని ఈసీ వివరించింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, పటిష్ఠంగా ఉందని ఈసీ (EC) మరోసారి పునరుద్ఘాటించింది.