Nepotism: నెపోటిజం ఉండని ఏకైక విభాగం భారత సైన్యమే: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్

బంధుప్రీతి (Nepotism) ఉండని ఏకైక విభాగం భారత సైన్యమేనని (Indian Army) చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ (CDS Anil Chauhan) వెల్లడించారు. రాంచీలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దేశానికి సేవ చేయాలనే లక్ష్యం పెట్టుకుని సాయుధ దళాల్లో (Armed Forces) చేరాలని వారికి సూచించారు. “బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం సైన్యం. మీరు దేశానికి సేవ చేయాలనుకుంటే, దేశంతో పాటు ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటే, త్రివిధ దళాల్లో (Tri-Forces) చేరడాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. ఇక్కడ కష్టానికి గుర్తింపు తప్పకుండా లభిస్తుంది” అని ఆయన (CDS Anil Chauhan) అన్నారు.
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అనేకమంది పౌరులను రక్షించడానికి సాయుధ దళాలు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. రెస్క్యూ ఆపరేషన్లలో సైనికులు తీవ్రంగా శ్రమించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆపరేషన్ సిందూర్’ను (Operation Sindoor) కూడా ప్రస్తావించారు. మే 7న అర్ధరాత్రి శత్రు స్థావరాలపై దాడులు చేశామని, ఒంటి గంటకు మొదటి దాడి జరిగిందని తెలిపారు. రాత్రి వేళల్లో దూరంలో ఉండే లక్ష్యాలపై దాడులు చేయడానికి ప్రత్యేక శిక్షణ, కృషి అవసరమని ఆయన (CDS Anil Chauhan) వివరించారు.