అధికారుల అభ్యర్థనలకు నో.. ఏపీ, తెలంగాణ క్యాడర్ విభజనపై కేంద్రం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్యాడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను ఏపీ నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. తమను ఏపీలోనే కొనసాగించాలని ఆ అధికారులు చేసిన అభ్యర్థనలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. అనంతరాము, ఎస్ఎస్ రావత్, హరికిరణ్, సృజన, శివశంకర్ ఏపీ క్యాడర్‌ను కోరుకున్నారు. వారికి కేంద్రం నో చెప్పింది. కేటాయించిన క్యాడర్ రాష్ట్రాల్లోనే కొనసాగాలని స్పష్టం చేసింది. అటు, తెలంగాణ క్యాడర్‌లోనే కొనసాగుతామని అభ్యర్థించిన పలువురు ఉన్నతాధికారుల విజ్ఞప్తికి కూడా కేంద్రం నో చెప్పింది. దాంతో, తెలంగాణ నుంచి ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్ వంటి ఐఏఎస్‌లు ఏపీలో సేవలు అందించనున్నారు.