Party Defection: పార్టీ ఫిరాయింపుపై కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు
బీజేపీ టికెట్‌పై గెలిచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిన ఎమ్మెల్యే ముకుల్ రాయ్‌పై (Mukul Roy) కోల్‌కతా హైకోర్టు అనర్హత వేటు వేసింది. బీజేపీ నేత, పశ్చిమ బెంగాల్ విపక్ష నేత సువేందు అధికారి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ షబ్బర్ రషీదీ, జస్టిస్ దేబాంగ్షు బాసక్తో కూడిన డివిజన్ బెంచ్ రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ముకుల్ రాయ్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా స్పీకర్ పక్షపాత వైఖరిని కోర్టు (Kolkata High Court) తీవ్రంగా విమర్శించింది.
సువేందు అధికారి (Suvendu Adhikari) ఈ తీర్పును ‘చరిత్రాత్మక తీర్పు’గా కొనియాడారు. ఇలాంటి పార్టీ ఫిరాయింపు విషయంలో దేశంలో డిస్క్వాలిఫై చేయడం ఇదే తొలిసారి కావొచ్చన్నారు. రాజ్యాంగాన్ని కోర్టు (Kolkata High Court) కాపాడిందని ఆయన పేర్కొన్నారు. ముకుల్ రాయ్ 2021 మేలో బీజేపీ తరపున గెలిచి, అదే ఏడాది ఆగస్టులో టీఎంసీలో చేరారు.






