Online Betting: కేంద్రం కీలక నిర్ణయం… ఆన్‌లైన్ బెట్టింగ్‌ను

ఆన్‌లైన్ బెట్టింగ్ (Online Betting )ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తూ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ను తీసుకురాబోతోంది. దీనిని ప్రధాని మోదీ (Modi) నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ (Cabinet) సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ బిల్లును లోక్‌సభ (Lok Sabha )లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ ఆగడాలు ఇటీవల కాలంలో పెచ్చరిల్లుతున్నాయి. ఈ యాప్ప్‌కు బానిసలై కొందరు అప్పుల ఊబిలో చిక్కుకోగా, మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ఈ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ యాప్స్‌పై నిషేధం ఉంది. అయినప్పటికీ నిఘా వ్యవస్థల కళ్లుగప్పి కొందరు వీటిని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ప్‌పై చర్యలకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.