DMK: ఈ నిర్ణయం వల్ల తమిళనాడు కు ప్రయోజనం లేదు : డీఎంకే

ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందిస్తున్న తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ఎంపిక చేసింది. ఈ విషయం పై తమిళనాడు అధికార డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ (TKS Ilangovan) స్పందిస్తూ రాధాకృష్ణన్ తమిళనాడు(Tamil Nadu)కు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈ నిర్ణయం వల్ల తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా జరిగే మంచి ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. తమకు ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు రాధాకృష్ణన్ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇండియా బ్లాక్ (India Block) తీసుకున్న నిర్ణయానికే తమ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.