Bihar Polls: బిహార్‌లో రికార్డు స్థాయిలో 64.66 శాతం పోలింగ్
బిహార్ అసెంబ్లీ తొలి దశ పోలింగ్ (Bihar Polls) అద్భుతంగా ముగిసింది. మొదటి దశలో ఏకంగా 64.66 శాతం పోలింగ్ నమోదైంది. గత 73 ఏళ్ల బిహార్ ఎన్నికల చరిత్రలో పోలింగ్ శాతం ఇంత ఎక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతకుముందు 2000 సంవత్సరంలో నమోదైన 62.57 శాతమే అత్యధికంగా ఉండేది. బిహార్‌లో 121 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ (Bihar Polls) జరిగింది. ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) తమ కుటుంబాలతో కలిసి పట్నాలో ఓటు వేశారు. కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, రాజీవ్ రంజన్ సింగ్, డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా (Vijay Kumar Sinha), సమ్రాట్ చౌదరి, సీఎం నితీశ్ కుమార్ తదితర ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును (Bihar Polls) వినియోగించుకున్నారు. తొలి దశ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత.. అధికారులు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఈ సందర్భంగా ఇంత భారీగా భారీగా తరలివచ్చి ఓట్లు వేసిన ప్రజలకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.







