Gamusa:ప్రధాని మోదీకి ప్రత్యేక బహుమతి : పూర్ణిమ బైశ్యా

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సెప్టెంబర్ 8న అస్సాం (Assam ) లో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడ స్థానిక నేత కార్మికురాలు పూర్ణిమ బైశ్యా ప్రధాని మోదీ కోసం ప్రత్యేక కానుకను సిద్ధం చేసింది. నల్బరి జిల్లా (Nalbari district ) కు చెందిన నేత కార్మికురాలు పూర్ణిమ బైశ్యా (Purnima Baishya) , ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని కలిగి ఉన్న ప్రత్యేకమైన చేతితో నేసిన గమూసా(Gamusa) ను తయారు చేసింది. వెదురు రెల్లు, కాటన్ దారాలతో సంప్రదాయ అస్సామీ డిజైన్లతో దీనిని నేసినట్లు ఆమె పేర్కొంది. ప్రధాని అస్సాంకు వచ్చినప్పుడు తను స్వయంగా తయారు చేసిన గమూసాను బహుమతిగా ఇచ్చి, ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది.