జీ-20 ఎఫెక్ట్ .. 160 విమానాల రద్దు!
ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే దాదాపు 160 దేశీయ విమాన సర్వీసులు రద్దు కానున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్టు లిమిటెడ్ ప్రతినిధి వెల్లడిరచారు. ఢిల్లీ నుంచి బయల్దేరి 80 విమానాలు, వచ్చే మరో 80 విమానాలు రానున్న మూడు రోజుల్లో రద్దయ్యే అవకాశం ఉందని తెలిపారు. జీ-20 సదస్సు కారణంగా రానున్న మూడు రోజుల్లో విధించిన ట్రాఫిక్ నిబంధనలతో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఈ సదస్సు కోసం ఎయిర్ పోర్టులో అన్ని రకాల పరికరాలు, పార్కింగ్ సౌకర్యాలను సిద్ధంగా ఉంచామని ఆ ప్రతినిధి వివరించారు. ఇప్పటి వరకు మా అంచనాల మేరకు మూడు రోజుల్లో రాకపోకలు సాగించే 160 దేశీయ విమానాలు రద్దవుతాయని భావిస్తున్నామన్నారు.






