Actress Kasturi: బీజేపీలో చేరిన సినీ నటి కస్తూరి
సినీనటి కస్తూరి బీజేపీలో చేరారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సమక్షంలో ఆమె కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కస్తూరితో పాటు నామిస్ సౌత్ క్వీన్ ఇండియా అధ్యక్షురాలు, నమిత మారిముత్తు లను ఆయన బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. సామాజిక కార్యకర్త, సినీ నటి కస్తూరి, నమితా మారిముత్తూ నేటి నుంచి అధికారింగా తమ రాజకీయ ప్రయాణంలో చేరడం స్వాగతించదగిన పరిణామమని నైనార్ నాగేంద్రన్ తెలిపారు. కస్తూరి మోడల్‌గానే కాకుండా తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోని పలు సినిమాల్లోలోనూ తనదైన నటనతో మంచి గుర్తింపు పొందారు. అంతేకాకుండా, పలు సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.







