Zelensky : జెలెన్స్కీ కీలక ప్రతిపాదన … పుతిన్, ట్రంప్‌తో కలిసి
రష్యా దాడుల్ని నిలిపేందుకు ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) కీలక ప్రతిపాదన చేశారు. పుతిన్ (Putin)తో చర్చలకు సిద్ధమని చెప్పారు. ద్వైపాక్షిక చర్చలకు పుతిన్‌కు ఇష్టం లేకపోతే, త్రైపాక్షిక చర్చలైనా సరే. ఏ తరహా సమావేశానికి అయినా నేను సిద్ధమే అని జెలెన్స్కీ ప్రతిపాదించారు. పుతిన్, ట్రంప్ కలిసి చర్చలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే శాంతి ఒప్పందానికి రాకుండా ముందుకెళ్తున్న రష్యా (Russia)పై అమెరికా (America) ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. క్రెమ్లిన్ బలగాలు కీవ్‌పై విరుచుకుపడి, ఈశాన్య సుమీలోని నాలుగు సరిహద్దు గ్రామాలను సీజ్ చేసిన నేపథ్యంలో కీవ్ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. మరోవైపు పుతిన్ దూకుడుపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిప్పుతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను లేకపోయి ఉంటే రష్యాకు చాలా చెడు జరిగి ఉండేదని, ఈ విషయాన్ని పుతిన్ తెలుసుకోవడం లేదని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.







