ఆ సాయం సరిపోదు : జెలెన్ స్కీ
స్విట్జర్లాండ్ సదస్సులో పాల్గొన్న దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. తమ దేశానికి అంతర్జాతీయ మద్దతు తరిగిపోవడం లేదని ఈ సదస్సు చాటిచెప్పిందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమపై యుద్ధాన్ని ఆపేలా కనిపించడం లేదని, ఆయన్ను ఎలాగైనా నిలువరించాలని వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాల నుంచి అందుకున్న సాయం తాము యుద్ధం గెలిచేందుకు సరిపోదని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా బలగాలు ఉక్రెయిన్ భూభాగాన్ని వీడితే వెంటనే ఆ దేశంతో శాంతి చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. చైనా తమకు శత్రువేమీ కాదని జెలెన్స్కీ అన్నారు. చైనా ప్రాదేశిక సమగ్రతను తాము గౌరవిస్తున్నామని, ఆ దేశం నుంచీ అదే ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు.






