Chandrababu: కుప్పంలో కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు : చంద్రబాబు
* కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో పరిశ్రమల అభివృద్ధిపై పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం
* కుప్పంలో కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు, నిర్మాణ దశలో ఉన్న పరిశ్రమల పురోగతి పై పారిశ్రామిక వేత్లల నుంచి తెలుసుకున్న సీఎం
* 21 పరిశ్రమలు కుప్పంలో ఏర్పాటు కాబోతున్నాయి.
* రూ. 7,684 కోట్ల పెట్టుబడులతో 35, 545 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా 44,584 ఉద్యోగాలు వస్తాయి
* కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమలకు అనుకూలమైన ఎకోసిస్టంను తయారు చేశాం
* ఆటోపైలట్ గా అభివృద్ది జరగాలన్నదే నా ఆకాంక్ష
* తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలు కుప్పం ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్నాయి
* భవిష్యత్తులో ఈ ప్రాంతానికి నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం
* శ్రీశైలం నుంచి నీటి సరఫరా జరిగేలా హంద్రీనీవా కాలువలు ఉన్నాయి
* ప్రతీ ఇంటిపైనా, ప్రతీ పొలంలోనూ సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు చేశాం
* రాష్ట్రంలో సౌర, పవన్ విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ లాంటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టాం
* దేశంలోనే మొదటి సారి గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి చర్యలు చేపట్టాం
* అతి తక్కువ వ్యయంతోనే విద్యుత్ ఉత్పాదన చేసేలా కార్యాచరణ చేస్తున్నాం
* డ్రోన్, స్పేస్, ఎలక్ట్రానిక్స్ సిటీలతో పాటు మెడ్ టెక్ పార్కులో వైద్య పరికరాలను తయారు చేస్తున్నాం
* విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది.
* రిలయన్స్ కూడా డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది
* అమెరికా లో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నాం
* త్వరలోనే క్వాంటం కంప్యూటర్ అమరావతి నుంచి పనిచేయటం ప్రారంభిస్తుంది
* అలాగే క్వాంట్ కంప్యూటర్ పరికరాలను కూడా త్వరలోనే తయారు చేయాలని ఆలోచన చేస్తున్నాం
* కుప్పంలో మంచి రోడ్డు నెట్వర్క్ ఉంది. కృష్ణగిరి పలమనేరు, చెన్నై బెంగుళూరు హైవేలు ఉన్నాయి
* కొత్తగా బెంగుళూరు నుంచి చెన్నై కేజీఎఫ్ మీదుగా మరో రహదారి వస్తుంది
* రైలు కనెక్టివిటి కూడా బెంగుళూరు నుంచి కుప్పానికి ఉంది
* చిత్తూరు-కుప్పం మధ్య కొత్త రైలు లైన్ మార్గం కూడా వేసేలా ఆలోచన లు చేస్తున్నాం
* కృష్ణపట్నం- రామాయపట్నం పోర్టులను లింకు చేస్తాం. త్వరలోనే కుప్పంలో ఎయిర్ పోర్టును కూడా నిర్మిస్తాం
* పెట్టుబడులకు బెస్ట్ డెస్టినేషన్ గా కుప్పం మారుతుంది.
* నిర్దేశిత గడువు లోగా పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నాను






