Naveen Polishetty: మెగాస్టార్ ను మెప్పించిన నవీన్ పోలిశెట్టి
ఈ సంక్రాంతికి తెలుగులో పలు సినిమాలు రిలీజవగా అందులో రాజా సాబ్ తప్పించి మిగిలిన అన్ని సినిమాలకూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నింటిలో చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు పండగ విన్నర్ గా నిలిస్తే, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయింది. సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ రీసెంట్ గా సంక్రాంతి బ్లాక్బస్టర్ పేరిట ఓ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ ఈవెంట్ కు డైరెక్టర్ బాబీ అతిథిగా హాజరై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. తాను నెక్ట్స్ సినిమా పని మీద రీసెంట్ గానే చిరంజీవి గారిని కలిశానని, ఆ టైమ్ లో మెగాస్టార్ తనను నవీన్ పోలిశెట్టి సినిమా గురించి అడిగారని, తాను సినిమా చాలా బావుందని చెప్తే, నవీన్ ఎంత ఎనర్జిటిక్ గా ఉంటాడో, ఈ జెనరేషన్ లో నాకు నచ్చిన హీరో అతనేనని చెప్పారని అన్నాడు.
తన సినిమా మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ కూడా, నవీన్ మూవీని ఆస్వాదిస్తున్నారని, ఈ విషయాన్ని నేరుగా అందరి ముందు చెప్పాలనే ఇప్పటివరకు నవీన్ కు కూడా చెప్పలేదని బాబీ అన్నారు. ఈ విషయం విన్న నవీన్ తెగ మురిసిపోగా, ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే తనను ప్రశంసించారని తెలియడంతో ఈ మూమెంట్ తనకు మెగా మూమెంట్ గా మిగిలిపోయింది.






