1+1 Offer: డైరెక్టర్ వి.సముద్ర, నటుడు 30 ఇయర్స్ పృథ్వీ చేతుల మీదుగా ఘనంగా “1+1 ఆఫర్” సినిమా ట్రైలర్ లాంఛ్
నిమ్మల శ్రీరామ్, మౌనిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “1+1 ఆఫర్”. ఈ చిత్రంలో రాజేష్ భూపతి, రోహిత్, బాలాజీ, సురేష్ కుమార్ యాదవ్, జీవన్, రామ్ (కేఏ పాల్ ఫేమ్)ఇతర కీలక పాత్రల్లో నటించారు .ఈ చిత్రాన్ని త్రివేణి పిక్చర్స్ బ్యానర్ పై వి.వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు .ఏఎస్ఆర్ (శ్రీరామ్) దర్శకత్వం వహించారు. సరికొత్త కథా కథనాలతో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన “1+1 ఆఫర్” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శుక్రవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో దర్శకుడు వి. సముద్ర, నటుడు 30 ఇయర్స్ ఫృథ్వీ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
విలన్ రాజేష్ మాట్లాడుతూ – “1+1 ఆఫర్” చిత్ర ట్రైలర్ లాంఛ్ చేసేందుకు వచ్చిన సముద్ర గారికి, పృథ్వీ గారికి థ్యాంక్స్. ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు మా డైరెక్టర్ శ్రీరామ్. కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ఎంజాయ్ చేస్తూనే ఒక మంచి విషయాన్ని ప్రేక్షకులు ఈ సినిమాలో చూడబోతున్నారు. అన్నారు.
హీరోయిన్ మౌనిక మాట్లాడుతూ – ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో నటిగా నా పర్ ఫార్మెన్స్ కు పేరొస్తుందని నమ్ముతున్నాను. “1+1 ఆఫర్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ వెనకున్న మంచి కథను ఈ చిత్రంలో మీరంతా చూస్తారు. అన్నారు.
దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ – “1+1 ఆఫర్” ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాతో వన్ ఫ్లస్ హండ్రెడ్ అనేలా దర్శకుడు శ్రీరామ్ గారు వంద సినిమాలు చేయాలి. విలన్ రాజేష్ ను చూస్తుంటే మన విలన్ అజయ్ లా కనిపిస్తున్నారు. అజయ్ లా రాజేష్ కూడా నటుడిగా పేరు తెచ్చుకోవాలి. సినిమాలో మ్యూజిక్ బాగుంది. “1+1 ఆఫర్” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
30 ఇయర్స్ ఫృథ్వీ మాట్లాడుతూ రాజేష్ మంచి ప్రతిభ గల నటుడు. హీరోగా “1+1 ఆఫర్” సినిమా ఆయనకు గుర్తింపు తీసుకురావాలి. దర్శకుడు శ్రీరామ్ అందరికీ నచ్చేలా సినిమా చేసినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమాను కూడా ప్రేక్షకులు సక్సెస్ చేస్తారు. అన్నారు.
దర్శకుడు ఏఎస్ఆర్( శ్రీరామ్) మాట్లాడుతూ – ఈ చిత్రానికి మొదట కాలం కలిసివస్తే అనే టైటిల్ పెట్టుకున్నాం. కానీ అది మరీ ఓల్డ్ టైటిల్ లా అనిపించి..”1+1 ఆఫర్” ఫిక్స్ చేశాం. 1+1 ఆఫర్ అనేది ప్రతి ఒక్కరికీ నోటెడ్ పేరు. సినిమా చూశాక ఈ కథకు ఇది సరైన టైటిల్ అని మీరే చెబుతారు. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్ చేశాం. త్వరలోనే మీ ముందుకు మూవీని తీసుకొస్తాం. అన్నారు.
నిర్మాత వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమా దర్శకుడు శ్రీరామ్ టైటిల్ చెప్పి కథ ఒప్పించాడు. కేవలం టైటిల్ బాగుందనే సినిమా నిర్మించడం జరిగింది. ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. అన్నారు.






