Mukkamala : అమెరికా 178 ఏళ్ల చరిత్రలో …రికార్డు సృష్టించిన భారత సంతతి వ్యక్తి
అమెరికా వైద్యసంఘం ( ఏఎంఏ) అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (Mukkamala) ( బాబీ) ఎన్నికయ్యారు. షికాగోలో జరిగిన ఏఎంఏ (AMA) వార్షిక సమావేశంలో ఆయన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. 178 ఏళ్ల చరిత్రలో ఈ సంఘానికి నాయకత్వం వహిస్తున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకెక్కారు. గతంలో ఏఎంఏ ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్‌కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో భారత్ (India) నుంచి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.







