రష్యా అధ్యక్షుడు కీలక ప్రకటన.. అలాగైతే కాల్పుల విరమణ చేస్తాం
గత రెండేళ్లకు పైగా ఎలాంటి ముగింపు లేకుండా ఉక్రెయిన్-రష్యా యుద్దం జరుగుతోంది. ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు ఆదేశిస్తానంటూ ఉక్రెయిన్‌కు ఆఫర్ ఇచ్చారు. అయితే అందుకు రెండు షరతులు విధించారు. రష్యా విదేశాంగ శాఖ కార్యాలయంలో పుతిన్ మాట్లాడుతూ మేం వెంటనే కాల్పుల విరమణ చేస్తాం అని అన్నారు. కాల్పుల విరమణకు ఆదేశాలతో పాటు చర్చలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తమ స్వాధీనంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని, నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని కీవ్‌కు షరతు విధించారు. తుది పరిష్కారం కోసం ఈ ప్రతిపాదన తెచ్చినట్లు, ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభిస్తామని తెలిపారు. అయితే ఒకవైపు జీ7 దేశాలు ఇటలీలో సమావేశమైన తరుణంలో ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.






