Turkey :ఆ రెండు దేశాలకు షాక్ ఇస్తున్న భారతీయులు … భారీగా తగ్గిన వీసా దరఖాస్తులు
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియే (Turkey), అజర్బైన్ (Azerbaijan) లపై భారత్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ రెండు దేశాలను బయ్‌కాట్ ఉద్యమం నడుస్తోంది. దీంతో ఆ రెండు దేశాలకు వెళ్లేందుకు భారత్ (India )నుంచి వెళ్లే పర్యాటకులు ఆసక్తి చూపించడం లేదు. ఈ రెండు దేశాల వీసా దరఖాస్తుల్లో 42 శాతం తగ్గుదల ఉందని వీసా ప్రాసెసింగ్ సంస్థ అట్లీస్ తెలిపింది. వీసా ప్రాసెస్ మధ్యలో ఉన్న దరఖాస్తుదారు చాలా మంది వాటిని ఉపసంహరించుకున్నారని పేర్కొంది.
తుర్కియే, అజర్‌బైజాన్‌కు ఈ సంవత్సరం పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జనవరి-మార్చి కాలంలో గత సంవత్సరం కంటే వీసా దరఖాస్తుల సంఖ్య 64 శాతం పెరిగిందని అట్లీస్ తెలిపింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఢల్లీి, ముంబై వంటి మెట్రో నగరాల నుంచి తుర్కియే, అజర్బైజాన్ దేశాలకు ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ప్రాంతాల నుంచి వచ్చే వీసా దరఖాస్తులు 53 శాతం తగ్గాయి.ఇండోర్(Indore), జైపూర్(Jaipur) వంటి టైర్ 2 నగరాల నుంచి వచ్చే ఫ్యామిలీ, గ్రూప్ ట్రిప్స్ వీసాల సంఖ్య 49 శాతం తగ్గాయి. ఒంటరిగా వెళ్లే వారి వీసాల 27 శాతం తగ్గాయి. ప్రధానంగా 24 నుంచి 34 ఏళ్ల వయస్సున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గారు. తుర్కియేకు వచ్చిన వీసా దరఖాస్తుల్లో ఇవి 70 శాతం విరమించుకున్నట్లు అట్లీస్ తెలిపింది.







