డయానా ఆర్మ్ స్ట్రాంగ్ గిన్నిస్ రికార్డు… ప్రపంచంలోనే
అమెరికాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ అనే మహిళ గిన్నిస్ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె చేతి వేళ్లకు 1,306.58 సె.మీ ( 42 అడుగుల 10.4 అంగుళాల) పొడవైన గోళ్లు ఉన్నట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు వెల్లడిరచారు. ఆమె 25 ఏళ్లుగా తన గోళ్లను పెంచుతోందని, అవి మినీ స్కూల్ బస్సు కంటే పొడవుగా ఉన్నాయని వారు తెలిపారు. 1997లో తన పెద్ద కుమార్తె లతీషా ఆస్తమాతో మరణించడంతో డిప్రెషన్లోకి వెళ్లానని డయానా తెలిపారు.లతీషాను పొడవైన గోళ్లంటే ఇష్టమని అందుకే అప్పటి నుంచి తన కుతూరి గుర్తుగా గోళ్లు పెంచుతున్నానని ఆమె పేర్కొన్నారు. అవి అందంగా కనిపించేందుకు వివిధ రంగులతో తరచూ పెయింట్ చేసుకుంటాని తెలిపారు. తాజాగా ప్రపంచ రికార్డు సాధించడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పోస్టును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్టు చేసింది.






