భారత్ కు అమెరికా వార్నింగ్!
చాబహార్ పోర్టు నిర్వహణకు సంబందించి భారత్, ఇరాన్ మద్య తాజాగా కీలక ఒప్పందం జరిగింది. ఈ డీల్ గురించి అమెరికా స్పందిస్తూ న్యూఢిల్లీని పరోక్షంగా హెచ్చరించింది. ట్రైహాన్తో వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలపై తాము ఆంక్షలకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ డిప్యూటీ అధికార ప్రతిని వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ ఈ డీల్ గురించి ప్రస్తావించారు. చాబహార్ ఓడరేవు నిర్వహణ కోసం భారత్, ఇరాన్ ఒప్పందం చేసుకున్నాయని మాకు తెలిసింది. టెహ్రాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, దేశ విదేశాంగ విధాన లక్ష్యాలపై న్యూఢిల్లీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఇరాన్ పై అమెరికా కొన్ని ఆంక్షలు విదించింది. వాటి అమలు కొనసాగుతూనే ఉంటుంది. ఏ సంస్థ అయినా, దేశమైనా టెహ్రాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపితే, వారు కూడా ఆంక్షల ఛట్రంలో పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని మేం ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశాం అని వెల్లడిరచారు.






