ఆ మందులను వాడొచ్చు… అమెరికా సుప్రీంకోర్టు
అవాంఛిత గర్భం వచ్చినవారు 10 వారాల్లోపు గర్భ విచ్చిత్తి కోసం మైఫిప్రిస్టోన్ మందును వాడవచ్చని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో పాటు మైసోప్రొస్టోల్ మందునూ వాడటంలో ఇబ్బందేమీ లేదని తెలిపింది. ఈ మందులకు ఎఫ్డీఏ అనుమతి ఇవ్వడాన్ని అబార్షన్ వ్యతిరేకులు సవాలు చేయలేరని పేర్కొంది. ఈ మందులను వాడటాన్ని ఎఫ్డీఏ సులభతరం చేయడంలో తప్పు లేదని స్పష్టం చేసింది. అమెరికాలో 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా 60 లక్షల మంది మైఫిప్రిస్టోన్ మందును వాడారు. దీంతోపాటు 10 వారాల్లోపు గర్భ విచ్ఛిత్తి కోసం మైసోప్రొస్టోల్ను వినియోగించారు.






