నేతలంతా ఒకవైపు.. బైడెన్ మరోవైపు!
జీ7 సదస్సు వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. సదస్సుకు వచ్చిన నేతలు బృందచిత్రం కోసం నిలబడి ఉండగా, వారంతా ఉన్నవైపు కాకుండా బైడెన్ మరోవైపు తిరిగి, ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా ముందుకు వెళ్లారు. అక్కడే వేరేవారితో మాట్లాడుతూ ఉండిపోయారు. గ్రూప్ ఫొటో దిగేందుకు ఎంతసేపటికి రాకపోవడంతో ఇటలీ ప్రధాని మెలోనీ వెళ్లి ఆయన్ను తీసుకొచ్చారు. ఆపై నేతలంతా బృందచిత్రానికి పోజిచ్చారు. సంబంధిత వీడియోను వీక్షించిన నెటిజన్లు బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు. వయసురీత్యా వచ్చే ఇబ్బందులతో బైడెన్ జ్ఞాపకశక్తిలో లోపాలను గుర్తించినట్లు గతంలో ఓ నివేదిక పేర్కొన్న సంగతి గమనార్హం.






