తైవాన్ కు అమెరికా ప్రతినిధుల బృందం
ఇటీవల తైవాన్‌కు అతి సమీపంలో సైనిక కవాతులతో చైనా కవ్వింపులకు దిగిన విషయం తెలిసిందే. దీంతో అమెరికన్ పార్లమెంటు సభ్యుల బృందం ఒకటి తైవాన్‌కు చేరుకొని, ఆ దేశ నూతన అధ్యక్షుడు లాయ్ చింగ్టెతో సమావేశమై అన్ని రకాలుగా మద్దతు ప్రకటించింది. ఈ ప్రతినిధి వర్గంలో నలుగురు రిపబ్లికన్లు, ఇద్దరు డెమోక్రాట్ ఎంపీలు ఉన్నారు. కాగా, అమెరికా పార్లమెంటు సభ్యుల పర్యటనను, తైవాన్ తమ అంతర్భాగమని వాదిస్తున్న చైనా తప్పబట్టింది. చైనా బలప్రయోగం నుంచి తైవాన్‌కు రక్షణ కల్పించడానికి కట్టుబడి ఉన్నట్లు అగ్రరాజ్యం గతంలోనే పేర్కొనడం గమనార్హం.






