America : ఖండాంతర అణు క్షిపణిని పరీక్షించిన అమెరికా
అమెరికా అత్యంత శక్తిమంతమైన ఖండాంతర అణు క్షిపణి మినిట్‌మ్యాన్-3ను పరీక్షించింది. ఓ పక్క అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్‌డోమ్ (Golden Dome) నిర్మిస్తున్నట్లు ప్రకటించిన వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. కాలిఫోర్నియా (California) లోని వాన్డెన్‌బెర్గ్ స్పేస్ బేస్‌లో ఈ పరీక్ష జరిగింది. ఈ క్షిపణి గంటలకు 15,000 మైళ్ల వేగంతో 4,200 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి మార్షల్ ఐల్యాండ్స్ (Marshall Islands)లోని అమెరికా స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్‌కు చెందిన బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదేశానికి చేరింది.







