America: గడువు మించిందా.. బహిష్కరణ వేటు తప్పదు : అమెరికా
నిర్దేశిత గడువు దాటి అమెరికా (America)లో ఉంటున్నవారిని ఉద్దేశించి భారత్ (India) లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఈ అంశంలో ఉల్లంఘనకు పాల్పడితే కలిగే తీవ్ర పరిణామాలను స్పష్టంగా వెల్లడిరచింది. బహిష్కరణ ముప్పు తప్పదని, అదేవిధంగా భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. పర్యాటక (Tourist), విద్యార్థి (student,), వర్క్ పర్మిట్స్ సహా వివిధ వీసాలపై అమెరికాలో నివసిస్తోన్న భారతీయుల (Indians)ను ఉద్దేశించి ఈ హెచ్చరిక చేసింది. అమెరికా ప్రయాణంపై నిషేధం పడితే భవిష్యత్తులో అక్కడ చదువు, వృత్తి వ్యక్తిగత అవకాశాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఏమైనా అనుకోని పరిస్థితుల కారణంగా దేశాన్ని వీడటంలో ఇబ్బందులు ఏర్పడితే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా ఉండేందుకోసం యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS ) ను సంప్రదించాలని అధికారులు సూచించారు.







