1958 లో చైనా పై… అమెరికా

తైవాన్‍ను చైనా బలగాల నుంచి రక్షించుకునే నేపంతో అమెరికా 1958లో చైనాపై అణుదాడికి ప్రణాళికలు వేసిందని అమెరికా ఆర్థికవేత్త, అమెరికన్ మిలటరీ మాజీ విశ్లేషకుడు డానియెల్ ఎల్బ్బర్గ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన రహస్య (క్లాసి ఫైడ్) పత్రాలను ఆయన ఆన్‍లైన్‍లో పోస్టు చేశారు. సోవియట్ యూనియన్ చైనాకు సాయం చేస్తోందని, అందుకు ప్రతిగా చైనాపై అణ్యాయుధాలతో విరుచుకుపడాలని భావించినట్లు ఆ పత్రాలు పేర్కొన్నాయని న్యూయార్క్ టైమ్స్ మొదటిసారిగా నివేదించింది. వియత్నాం యుద్దానికి సంబంధించి అమెరికా మిలటరీ రహస్య అధ్యయనాన్ని 1971లో పెంటగాస్ పేపర్స్ పేరుతో ఆ దేశ మీడియాకు లీక్ చేయడంతో డానియెల్ వార్తల్లొకెక్కారు. 1970 ప్రారంభంలో తైవాన్ సంక్షోభంపై అధ్యయనాన్ని తాను కాపీ చేశానని, తైవాన్ అమెరికా, చైనా మధ్య ఉద్రికత్తలు పెరిగిన నేపథ్యంలో దానిని విడుదల చేశానని ఎల్స్బర్గ్ తెలిపారు.