BCCI: విండీస్ టెస్ట్ లపై బీసీసీఐ కీలక నిర్ణయం..?
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనలతో టెస్ట్ క్రికెట్ కు భారత్ మరోసారి ఊపు తీసుకొచ్చింది. ఈ రెండు సిరీస్ లకు భారీగా ఆదాయం కూడా లభించింది. ఇక త్వరలో జరగబోయే వెస్టిండీస్ సీరిస్ విషయంలో కూడా ఇలాగే దృష్టి పెట్టింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. ఈ సిరీస్ విషయంలో గతంలో ఎప్పుడు పెద్దగా హడావుడి జరిగేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం దీనిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ టెస్టు సీరిస్ ను వాస్తవానికి భారత అభిమానులు చూడటానికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది.
రాత్రి సమయంలో జరగటంతో కాస్త మ్యాచ్ చూడటానికి అనువుగా ఉండదు. దీంతో సమయాల్లో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి మ్యాచ్ మొదలుపెట్టే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో కూడా ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చర్చలు జరుపుతోంది. ఆసియా కప్(Asia Cup) ముగిసిన మూడు రోజుల తర్వాత ఈ సీరిస్ మొదలుకానుంది. ఇక జట్టు ఎంపిక విషయంలో కూడా వెస్టిండీస్ దూకుడుగానే వ్యవహరించింది.
భారత్ కంటే ముందుగానే టెస్టు జట్టును ప్రకటించింది. ఇక త్వరలోనే భారత్ కూడా ఈ పర్యటనకు టెస్టు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ సీరిస్ కు కేఎల్ రాహుల్(KL Rahul) కెప్టెన్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని, ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. శుభమన్ గిల్ కు విశ్రాంతి ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఇక రిషబ్ పంత్ వైఎస్ కెప్టెన్ గానే కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం గాయం నుంచి కోలుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టే ఆలోచనలో పంత్ ఉన్నాడు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక మ్యాచ్ టైమింగ్స్ పై భారత్ త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అటు ఐసిసి తో కూడా సంప్రదించిన తర్వాత, ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. దీనిపై రాబోయే వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.






