US Visa: ఆ కారణంతో భారతీయ వ్యాపారవేత్తల యూఎస్ వీసాలు రద్దు!

కొందరు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్తలకు, వారి కుటుంబాలకు వీసాలను యూఎస్ (US Visa) తిరస్కరించింది. ఇప్పటికే ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేసింది. సదరు వ్యాపారవేత్తలు అమెరికాకు అక్రమంగా ఫెంటనిల్ రవాణా చేస్తున్నారనే ఆరోపణల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూ ఢిల్లీలోని యూఎస్ ఎంబసీ (US Embassy) వెల్లడించింది. ఫెంటనిల్ (Fentanyl) అనేది ఒక పవర్‌ఫుల్ సింథటిక్ డ్రగ్. గతేడాది యూఎస్‌లో వేలాది మరణాలకు ఇది కారణమైంది. దీంతో ఫెంటనిల్‌పై పోరాటం మొదలు పెడతామని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే కొందరు భారతీయ కార్పొరేట్‌ల వీసాలను (US Visa) అమెరికా సర్కారు రద్దు చేసినట్లు సమాచారం.
ఈ చర్యల వల్ల సదరు వ్యాపారవేత్తలు, వారి కుటుంబ సభ్యులు ఇకపై యూఎస్ (USA) ప్రయాణానికి అనర్హులుగా మారనున్నారు. అలాగే ఫెంటనిల్ రవాణాకు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీల్లో పనిచేసిన ఎగ్జిక్యూటివ్‌లు ఎవరైనా ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా వారిపై కఠినమైన దర్యాప్తు ఉంటుందని యూఎస్ ఎంబసీ (US Embassy) స్పష్టం చేసింది. అయితే ఈ చర్యలు ఏ కంపెనీలు, వ్యక్తుల మీద తీసుకున్నామనే వివరాలను మాత్రం ఎంబసీ గోప్యంగా ఉంచింది.